Homeహైదరాబాద్latest Newsదడ పుట్టిస్తున్న హైడ్రా.. అసలు హైడ్రా అంటే ఏమిటంటే..?

దడ పుట్టిస్తున్న హైడ్రా.. అసలు హైడ్రా అంటే ఏమిటంటే..?

హైడ్రాకు చైర్మన్‌ సీఎం కాగా.. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏవీ రంగనాథ్‌ కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. జీవో 99 ద్వారా ప్రభుత్వం ఒక స్వయంప్రతిపత్తి సంస్థగా హైడ్రాకు ఇచ్చిన విస్తృత అధికారాల మూలంగా ‘ఈ కూల్చివేతలు ఆగవు, వెనక్కి తగ్గేది లేదు, ఎవరున్నా వదిలేది లేదు’ అని దాని కమిషనర్‌ రంగనాథ్‌ తెగేసి చెప్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చిన మున్సిపల్‌, ఇతర విభాగాల అధికారులపై కూడా చర్యలుంటాయని ఆయన చెప్తున్నారు.

హైడ్రా అంటే ఏమిటంటే…
హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో వేలాది ఎకరాల ప్రభుత్వ, చెరువు, వక్ఫ్, దేవాదాయశాఖ, పార్కులు, ఇనాం భూములు కబ్జాదారుల చెరలో ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఈ ఆక్రమణలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇంకా చెరువులు, నాలాల భూముల కబ్జాల పాలవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కబ్జాదారుల బారి నుంచి సర్కారు భూములకు విముక్తి కల్పించడంతోపాటు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు తెలంగాణ సర్కారు హైడ్రాను రంగంలోకి దించింది.

Recent

- Advertisment -spot_img