HomeసినిమాYoutubeను షేక్ చేస్తున్న‘Salar’​ Trailer

Youtubeను షేక్ చేస్తున్న‘Salar’​ Trailer

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్​గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ భారీ మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ మూవీ సలార్ పార్ట్ 1 సీస్ ఫైర్. మొదటి నుంచి ఈ మూవీపై అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీని హోంబలె ఫిలిమ్స్ సంస్థ నిర్మించగా రవి బస్రూర్ సంగీతం అందించారు. ఈ నెల 22న రిలీజ్​కు సిద్ధమైన సలార్​ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్, ట్రైలర్, ఫస్ట్ సాంగ్ ఆడియెన్స్​ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా సోమవారం మూవీ టీమ్​ రిలీజ్​ ట్రైలర్​ను విడుదల చేసింది. ఇందులో భారీ మాస్ యాక్షన్ సన్నివేశాలు, ఫైట్స్, గ్రాండియర్ విజువల్స్, ప్రభాస్ లుక్స్, స్టైల్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ అదిరిపోయాయి. మొత్తంగా మాసివ్ యాక్షన్​తో అదరగొట్టిన ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్​లో మంచి వ్యూస్ సొంతం చేసుకొని షేక్ చేస్తోంది.

Recent

- Advertisment -spot_img