Homeహైదరాబాద్latest News‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ట్రైలర్ వచ్చేసింది.. అదిరిపోయిన వెంకీ కామెడీ..!

‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ట్రైలర్ వచ్చేసింది.. అదిరిపోయిన వెంకీ కామెడీ..!

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా 2025లో జనవరి 14న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ గా ఉంది. ఈ సినిమాలో వెంకటేష్ తన కామెడీ స్టైల్ తో ఇరగదీసారు. ఈ
ట్రైలర్ లో వచ్చే డైలాగు లు హైలైట్ గా ఉన్నాయి. మనకి గతంలో ఒక లవ్ స్టోరీ ఉంటుంది.. కానీ అవి మాత్రం మీ పెళ్లలతో చెప్పకండి అంటూ వెంకీ చెప్పే డైలాగు కానీ.. అలాగే ప్రతి మగాడికి పెళ్ళికి ముందు ఒక లవర్ ఉంటుంది అనే డైలాగు లు అదిరిపోయాయి. ఈ సినిమాతో వెంకటేష్ భారీ హిట్ కొట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించారు.

Recent

- Advertisment -spot_img