Homeహైదరాబాద్latest Newsలారీ ఢీకొని వాహనం బోల్తా.. బయటపడ్డ రూ.7 కోట్లు ఎన్నికల డబ్బు..

లారీ ఢీకొని వాహనం బోల్తా.. బయటపడ్డ రూ.7 కోట్లు ఎన్నికల డబ్బు..

ఏపీలో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతుండటంతో రాజకీయ పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తరలిస్తున్న ఎన్నికల సొమ్ము పోలీసుల తనిఖీల్లో భారీగా పట్టుబడుతోంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో వ్యాన్ లో పెట్టెల్లో నగదు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలోని అనంతపల్లి మండలం ఎర్రకాలువ సమీపంలో టాటా ఏస్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో తౌడులో కలిపే కెమికల్ బస్తాలతో ఉన్న వాహనం బోల్తా పడింది. విశాఖ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద వార్త తెలియగానే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఈ వాహనంలోని బస్తాల మధ్య 7 పెట్టెల్లో నగదు దాచి ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే ఉన్నతాధికారులకు తెలిపారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు నగదును వీరవల్లి టోల్‌ప్లాజాకు తరలించి లెక్కించగా దాదాపు రూ. 7 కోట్లు ఉన్నట్లు తెలిపారు. వాహనం డ్రైవర్‌కు గాయాలు కాగా పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img