ఇదేనిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణం కాశిట్టివాడకు చెందిన బుదారపు కావ్య అను మహిళా నిన్న సాయంత్రం ఐదు గంటల సమయంలో మీసేవకు వెళ్తా అని ఇంట్లో చెప్పి తిరిగి రాలేని విషయం మనకు తెలిసిందే. మహిళ తన భర్తతో తను చనిపోవడానికి (సూసైడ్) వెళ్తున్నట్టు మేసెజ్ చేయడంతో ధర్మపురి పోలీస్ స్టేషన్ కు వచ్చి సాయంత్రం 06.30 ఫిర్యాదు ఇవ్వగా ధర్మపురి పోలీస్ వారు వెంటనే స్పందించి బుదారపు కావ్య వెళ్లిన సమయం నుండి సీసీటీవీ కెమెరా ఆధారంగా మరియు వాట్సాప్ గ్రూప్ లలో ఈ విషయాన్ని ఫార్వర్డ్ చేయడం వల్ల, గమనించి బుధరపు కావ్య ను కరీంనగర్ బస్టాండ్ లో తన ఆచూకీ ని ఫిర్యాదు చేసిన రెండు గంటల లోపు కనుక్కొని తన కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. మహిళా తల్లిదండ్రులు సిఐ రామ నరసింహారెడ్డి, ఎస్సై మహేష్, ధర్మపురి పోలీస్ సిబ్బందికి మరియు సహకరించిన మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.