సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో సినీ హీరో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో శనివారం ఉదయం జైలు నుంచి విడుదలై ఇంటికి వెళ్లిపోయారు. దీంతో అల్లు అర్జున్‌ను పరామర్శించేందుకు ప్రముఖ సినీ నటులు ఇంటికి వెళ్లి సంఘీభావం తెలిపారు. అయితే ఈ క్రమంలో హీరో మంచు మనోజ్ ఆసక్తికర ట్విట్ చేసారు. మొత్తం దిస్తీ అంత పోయింది బాబాయి.. తిరిగి స్వాగతం అని మనోజ్ అన్నారు. సంధ్య థియేటర్‌లో జరిగిన విషాద సంఘటన నిజంగా హృదయ విదారకమైనది మరియు మనందరికీ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడానికి మరియు ఒకరినొకరు చూసుకోవడానికి ఒక రిమైండర్‌గా పనిచేస్తుంది.మీ కుటుంబంతో మీకు శాంతి, సంతోషం కలగాలని కోరుకుంటున్నాను అని మంచు మనోజ్ ట్విట్ చేసాడు.