– ఏపీలోని పల్నాడు జిల్లాలో ఘటన
ఇదేనిజం, హైదరాబాద్: అప్పు చెల్లించలేదని ఓ మహిళను కిడ్నాప్ చేసిన ఘటన ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఉప్పలపాడులో చోటు చేసుకున్నది. ఈవెంట్ ఆర్గనైజర్ నాగలక్ష్మి తన కుమారుడు, కోడలుతోకలిసి జగనన్న కాలనీలో నివాసం ఉంటున్నారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో ఐదుగురు దుండగులు వచ్చి నాగలక్ష్మితో గొడవ పడ్డారు. నాగలక్ష్మి కోడలు లక్ష్మీప్రణతి తమకు అప్పు చెల్లించాల్సి ఉందని ఆమెను కిడ్నాప్ చేశారు.