Homeహైదరాబాద్latest NewsKTR అసమర్థత వల్లే పనులు పూర్తి చేయలేదు

KTR అసమర్థత వల్లే పనులు పూర్తి చేయలేదు

– ఆ ప్రాజెక్ట్‌ల బాధ్యతను ప్రభుత్వం స్వీకరించింది

– కాంగ్రెస్ పార్టీ సిరసిల్లా నియోజక వర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి

ఇదే నిజం, ముస్తాబాద్: మండలం కొండాపూర్‌లో రూ.7లక్షల వ్యవయంతో స్పేషల్ డెవలప్‌మెంట్ కింద తాగు నీటి సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేస్తున్న పైపులైన్ల పనులను ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్థులతో కలసి కాంగ్రెస్ పార్టీ సిరసిల్లా నియోజక వర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిరిసిల్లా శాసన సభ్యులు కేటీఆర్ నిర్లక్ష్యం వహించిన తొమ్మిది, పది, పదకొండవ ప్యాకేజీ పనులను రానున్న రెండేల్లలో పూర్తి చేసి లక్షా డెభైవేల ఎకరాలకు నీరందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని స్ఫష్టం చేశారు. అలాగే వ్యవసాయ రంగంతో పాటు గ్రామీణ ప్రారంతాలలోని విద్య, వైద్యానికి సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీఠ వేస్తున్నారని వెల్లడించారు. కావున కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి ప్రజలు సహకరించి అండగా నిలువాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, పార్టీ మండలాధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి, ముస్తాబాద్ ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, పట్టణ అధ్యక్షులు గజ్జెల రాజు, మాజీ జెడ్పీటీసీ మేరుగు యాదగిరి గౌడ్, నాయకులు ఉచ్చిడి బాల్ రెడ్డి, కర్ణాకర్, కొండం రాజిరెడ్డి, శీల ప్రశాంత్, గ్రామ శాఖ అధ్యక్షులు గంత రాజు, క్యారం రాజు, వంగ మేహన్ రెడ్డి, బషీరొద్దిన్, గుడెపు చిట్టయ్య, క్యారం రామచంద్రం, దేవిరెడ్డి, నవాబు, శ్రీనివా

Recent

- Advertisment -spot_img