ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా ‘పుష్ప 2’.ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రష్మిక మందాన హీరోయినిగా నటించింది. ఇటీవలే ఈ సినిమా నుండి ట్రైలర్ ను చిత్రబృందం రిలీజ్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ మంచి వ్యూస్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.ఈ సినిమా ట్రైలర్ పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ క్రమంలో ఈ సినిమా ట్రైలర్ పై వైసీపీ నేత నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ‘వైల్డ్ ఫైర్’ని బిగ్ స్క్రీన్‌పై చూడాలని ఎదురుచూస్తున్నా.. ఆల్ ది వెరీ బెస్ట్ బన్నీ’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీనిపై అల్లుఅర్జున్ స్పందిస్తూ… థ్యాంక్యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్ అంటూ పోస్ట్ చేసారు. జనసేన పార్టీకి కాకుండా తన స్నేహితుడు శిల్పా రవికి మద్దతుగా అల్లు అర్జున్ నంద్యాల వెళ్లారు. ఈ విషయమై మెగా ఫ్యాన్స్‌తో పాటు మెగా హీరోలు కూడా అల్లు అర్జున్‌ని మెగా ఫ్యామిలీకి దూరం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించాయి.ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న రిలీజ్ కాబోతుంది.