మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన శివాని పరిహార్ అనే యువతి చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడిని ఆరాధించేంది. దీంతో కృష్ణుడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఆమె.. తన తల్లిదండ్రులను అందుకు ఒప్పించింది. తాజాగా బంధుమిత్రుల సమక్షంలో శ్రీకృష్ణ పరమాత్ముని విగ్రహంతో పెళ్లి చేసుకుంది. అనంతరం అప్పగింతలు కార్యక్రమం కూడా నిర్వహించారు. ఇక నుంచి ఆమె కృష్ణుడి సేవలోనే ఉండనుంది.