మహారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పూణెలోని శివాజీ నగర్‌లోని స్లమ్ ప్రాంతంలో గది వివాదంతో తమ్ముడు, అతని భార్య కలిసి తన సోదరి సకీనా ఖాన్ (48)ని హత్య చేశారు. అనంతరం ఎలాంటి ఆధారాలు లేకుండా మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి నదిలో పడేశారు. అయితే ఆగస్టు 26న ఖరాడి ప్రాంతంలోని ముఠా నది ఒడ్డున ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. విచారణ చేపట్టిన పోలీసులకు అసలు నిజం తెలిసింది. దీంతో నిందితులను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.