ఇదేనిజం, మెట్ పల్లి : రంగస్థల కళాకారులకు మెట్ పల్లి లలిత కళా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఉగాది రంగస్థల నృత్య కేలి కార్యక్రమంలో భాగంగా సీనియర్ కళాకారులు తిరు కోవెల లక్ష్మణస్వామి, సినీ నటులు గోదూర్ మురళి లను ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ జువ్వాడి కృష్ణారావు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాకారుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో లలిత కళా సమితి అధ్యక్షులు మట్టెల గంగాధర్ సభ్యులు నవీన్ కుమార్, కోటగిరి వెంకటస్వామి, చైతన్య, మర్రి భాస్కర్, చొప్పరి శ్రీనివాస్, భూపతి గౌడ్, భుజంగరావు, గుండారపు నాగభూషణం, మారుతి, సంజీవ్, మధు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.