Homeక్రైంజవహర్​ నగర్​ పోలిస్టేషన్​ పరిధిలో భారీ చోరి..

జవహర్​ నగర్​ పోలిస్టేషన్​ పరిధిలో భారీ చోరి..

జవహర్​ నగర్​, ఇదే నిజం: రాచకొండ కమీషనరేట్​ జవహర్​ నగర్​ పోలిస్టేషన్​ పరిధిలోని దమ్మాయిగూడలో తాళం వేసి ఉన్న ఇంటిని గుల్ల చేశారు దుండగులు. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దమ్మాయిగూలోని వికాస్​ నగర్​, రోడ్​ నెంబర్​ 5లో నివసించే ఫనిశ్రీ నాయుడు అనే మహిళ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మమ్మవారి ఇంటికి శనివారం పూజకి వెళ్లింది. తిరిగి సోమవారం ఉదయం వచ్చేసరికి ఇల్లు గుల్ల చేశారు దుండగులు. బెడ్​ రూమ్​ లోని అల్మారిలో ఉన్న 15 తులాల బంగారు నగలు, 4 పట్టు చీరలు, 1 లక్షరూపాయల నగదు ఎత్తుకుపోయిన దుండగులు. విషయం తెలుసుకున్న జవహర్​ నగర్​ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి క్లూస్​ టీం సహాయంతో దర్యాప్తు ప్రారంభించారు..

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img