హైదరాబాద్, ఇదేనిజం : ఒంటరిగా వెళుతున్న మహిళలలే లక్ష్యంగా చేసుకుని దోచుకుంటున్న దుండగులను అదుపులోకి తీసుకుని వారి వద్దనుంచి బంగారు ఆభరణాలు స్వాధీనంచేసుకున్న సంఘటన సోమవారం శంషాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. కేసు వివరాలను శంషాబాద్ డివిజన్ ఏసీపీ ఆశోక్‌కుమార్, తన కార్యలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మహాబుబ్‌నగర్ జిల్లా హాన్వాడ మండలంకు చెందిన ముడావత్ రవినాయక్, నగరంలో ఉపాధి నిమిత్తం సరుర్నగర్లో ఉంటు హోంగార్డుగా పనిచేసేవాడు. మాధాపుర్ ఠాణాలో పనిచేస్తూ చేడు వ్యసనాలకు అలవాటుపడి దారితప్పి చోరిలకు పాల్పతున్నాడు. దీంతో ఇతన్ని విధుల నుంచి అధికారులు తోలిగించారు. అయిన ప్రవర్తనలో మార్పు రాలేదు. గత కోంతకాలంగా ఒంటరి మహిళలను లక్ష్యం చేసుకుని చోరిలకు పాల్పడుతున్న ఘటన తెరపైకి రావడంతో పోలీసులు నిఘా పెంచారు. దీంతో సోమవారం నిందితుడు అనుమానస్పందంగా కనిపించడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని సోదా చేయగా 7 తులాల బంగారు నగలు, 6 తులాల వేండి ఆభరణాలు దోరికాయి. వేంటనే అతన్ని స్టేషన్‌కు తరలించి విచారించడంతో పాతనేరస్థుడని తెలింది. దీంతో కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు.