అది 1995 సంవత్సరం.. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయిన సందర్భంగా.. టీడీపీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు పేరును ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రతిపాదించారు. ఇప్పుడు 2024లో చంద్రబాబును ఎన్టీయే శాసనసభాపక్ష నేతగా బలపరుస్తున్నట్లు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సతీమణి, చంద్రబాబు వదిన పురందేశ్వరి ప్రకటించారు.