– వివరాలు వెల్లడించిన సీఈవో వికాస్ రాజ్
ఇదే నిజం, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 60 మంది వ్యవ పరిశీలకులను నియమించామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వికాస్‌రాజ్ తెలిపారు. పోలింగ్ ఏర్పాట్లు, తదితర అశాలపై ఆయన గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.‘రాష్ట్రంలో 18-19 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లు 9.9లక్షల మంది ఉన్నారు. సర్వీసు ఓటర్లు ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారు. శాసనసభ ఎన్నికల పోలింగ్ కోసం 36వేల ఈవీఎంలు సిద్ధం చేశాం. ఈ సారి కొత్తగా 51లక్షల ఓటరు కార్డులు ప్రింట్ చేసి పోస్టల్ శాఖ ద్వారా పంపిణీ చేశాం. 60 మంది వ్యయ పరిశీలకులను నియమించాం. 3 కేటగిరీల వారికి హోం ఓటింగ్ అవకాశం కల్పించాం. ఇప్పటికే 9వేలకు పైగా ఓటర్లు హోం ఓటింగ్ వేశారు. ఇప్పటికే 86శాతం ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి చేశాం. రాష్ట్రంలో మొత్తం 35,635 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఆరు నియోజకవర్గాల్లో 5వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పోలింగ్ సిబ్బందికి పోలింగ్ కేంద్రంలోనే అన్ని సదుపాయాలు కల్పిస్తాం. ప్రతి కౌంటింగ్ సెంటర్‌కు ఒక పరిశీలకులు ఉంటారు.’అని వికాస్ రాజ్ తెలిపారు.