ఇప్పుడు మెట్రోకు కొత్త కోచ్‌లు రావడం కష్టమని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. త్వరలో నాగ్‌పూర్‌కు సంబంధించిన అద్దె ప్రాతిపదికన మెట్రో కోచ్‌లను తీసుకువస్తామని చెప్పారు. గతంలో మెట్రో నష్టాలకు చాలా కారణాలున్నాయన్నారు. 8 ఏళ్లుగా కొత్త మెట్రో లేకపోవడంతో హైదరాబాద్ మెట్రో 9వ స్థానానికి చేరుకుందన్నారు. మెట్రో రెండో దశ పూర్తయితే రెండో స్థానానికి చేరుకునే అవకాశం ఉందని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. చాంద్రాయణగుట్ట ప్రధాన జంక్షన్.. మెట్రో రైలు రెండో దశపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారన్నారు. రూ. 24,269 వేల కోట్ల రూపాయలతో రెండో దశ మెట్రో పనులు ప్రారంభిస్తామన్నారు. ప్రపంచంలోనే విజయవంతమైన మెట్రోల్లో హైదరాబాద్ మెట్రో ఒకటిగా నిలిచిందన్నారు.