Homeహైదరాబాద్latest Newsరాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోంది : Rahul Gandhi

రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోంది : Rahul Gandhi

– బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుంది
– తన దోస్తుల కోసం మోడీ రూ.16 లక్షల కోట్లు మాఫీ చేశారు
– తెలంగాణలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం
– కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి మహిళ అకౌంట్​లో ఏడాది రూ. లక్ష జమ
– నిర్మల్​లో జరిగిన జనజాతర సభలో రాహుల్​ గాంధీ వ్యాఖ్యలు

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: దేశంలో రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. లోక్​సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాష్ట్రానికి వచ్చిన రాహుల్​ గాంధీ మధ్యాహ్నం నిర్మల్​లో జరిగిన జన జాతర సభలో పాల్గొని ప్రసంగించారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందన్నారు. రాజ్యాంగాన్ని మార్చడం అంటే రిజర్వేషన్లను ఎత్తివేయడమే అని ఆయన చెప్పారు. ‘ బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే మీ హక్కులను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుంది. పేదలు, వెనుకబడిన వర్గాలు, దళితుల హక్కులను లాక్కోవాలని ప్రయత్నిస్తోంది. ప్రధాని మోడీ తన దోస్తుల కోసం రూ. 16 లక్షల కోట్ల నిధులను మాఫీ చేశారు. ఆ డబ్బుతో 25 కోట్ల మందికి ఉపాధి కల్పించవచ్చు. తెలంగాణలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తాం. కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణలో ఇచ్చిన హామీలను దేశమంతా అమలు చేస్తాం. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి మహిళ అకౌంట్​లో ఏడాదికి రూ. లక్ష జమ చేస్తాం. మోడీ నిరుద్యోగులను పట్టించుకోలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాన్ని హక్కుగా మారుస్తాం. కేంద్రంలోని 30 లక్షల ఖాళీలను వెంటనే భర్తీ చేస్తా. తెలంగాణలో పోడు భూముల సమస్యను త్వరలోనే తీరుస్తాం. ఉపాధి హామీ కింద రోజుకు రూ.400 రోజు ఇస్తాం. కులగణన చేసి తీరుతాం’ అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

Recent

- Advertisment -spot_img