తెలంగాణ రాష్ట్రంలో హాస్టళ్లలో తరచూ ఫుడ్ పాయిజన్ అవుతున్న ఘటనలపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనల వెనుక భారీ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఈ కుట్ర వెనుక ఎవరున్నారో వెల్లడిస్తాం. ఈ కుట్రలో అధికారులు ఎవరో తేలితే వారి ఉద్యోగాలను తొలగిస్తాం. ఇందులో ఒక రాజకీయ పార్టీ కుట్ర ఉందని అనుమానిస్తున్నాం.. ఆధారాలతో సహా బయటపెడతాం అని మంత్రి సీతక్క తెలిపారు.