బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ప్రస్తుతం హోరా హోరీగా సాగుతుంది. ప్రస్తుతం 13వ వారం నామినేషన్స్ మొత్తం ఏడుగురు ఉన్నారు. ఈ వారం నామినేషన్లలో యష్మీ డైరెక్ట్ గౌతమ్ కృష్ణపై పెద్ద బాంబ్ నామినేట్ చేసింది. ఈ వారం గౌతమ్ నేరుగా నామినేషన్స్‌లోకి ప్రవేశించాడు. బిగ్ బాస్ 8 తెలుగు వారం 13 నామినేషన్లలో గౌతమ్‌తో పాటు నిఖిల్, ప్రేరణ, విష్ణుప్రియ, పృథ్వీ, టేస్టీ తేజ మరియు అవినాష్ ఉన్నారు. మెగా చీఫ్ కావడంతో జబర్దస్త్ రోహిణిని ఎవరూ నామినేట్ చేయడానికి కుదరదు.
అయితే ఈ వారం నామినేషన్స్ ప్రక్రియలో గౌతమ్ vs నబీల్, పృథ్వీ vs అవినాష్ వీరి మధ్య పెద్ద ఆర్గుమెంట్ జరిగినట్లు తెలుస్తుంది. ముందుగా గౌతమ్‌ను నబీల్ నామినేట్ చేస్తూ.. నామినేషన్లో ఫైర్ కనిపిస్తుంది.. గేమ్‌లో ని ఫైర్ ఎక్కడ కనిపించడం లేదు అని గౌతమ్‌ని నామినేట్ చేశాడు నబీల్. దానికి గౌతమ్..నీకు గ్రాములు లెక్క కిలోలు లెక్క కాదు టన్నుల లెక్కలో ఫైర్ చూపిస్తాను అని గౌతమ్
నబీల్ కి సవాల్ చేస్తాడు. అలాగే పృథ్వీ అవినాష్ ని నామినేట్ చేస్తూ.. నువ్వు గేమ్ ఆడటం లేదు అని.. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావ్ అని అంటాడు.దానికి అవినాష్.. నేను ఈ హౌసులో రెండు సార్లు మెగా చీఫ్ అయ్యాను… నువ్వు అయ్యావా అంటూ పృథ్విని ప్రశ్నిస్తాడు. ఇల్లా ఇద్దరి నామినేషన్లపైనా బాగానే వాదనలు జరిగినట్లు తెలుస్తోంది. దాంతో ఈ వారం గౌతమ్, నిఖిల్, ప్రేరణ, విష్ణుప్రియ, పృథ్వీ, టేస్టీ తేజ మరియు అవినాష్ ఉన్నారు.