హైదరాబాద్లో కొత్తగా మరో జూపార్క్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతుంది.. దీనిపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు కూడా చేస్తోంది. అయితే రెండో జూపార్క్ ఎక్కడ ఏర్పాటు చేస్తారనే చర్చ జరుగుతున్న సమయంలో.. హైదరాబాద్ నగరం శివారు ముచ్చర్ల ప్రాంతంలో ఏర్పాటయ్యే ఫోర్త్ సిటీలో జూపార్కు ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఫోర్త్ సిటీ ఏర్పాటయ్యే ప్రాంతంలో ఏకంగా 15 వేల ఎకరాలకు పైగా రెవెన్యూ భూమి ఉంది.. అందుకే అక్కడ జూపార్కును ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చారట.