ఇదే నిజం దేవరకొండ : నల్గొండ జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తో కలిసి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పాల్గొన్నారు .ఈ సందర్భంగా నేనావత్ బాలు నాయక్ మాట్లాడుతూ,ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ కోసంఅన్నిసమకూరుస్తున్నామన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో వచ్చేనెల జూలై నుంచి రుణమాఫీ అమలవుతుందని తెలిపారు. రూ.31 వేల కోట్లతో రైతుల రుణమాఫీ జరుగుతుందని వెల్లడించారు.
•ప్రభుత్వం చేయబోయే రుణమాఫీని తట్టుకోలేక ప్రతిపక్షం వాళ్లు నోరుజారి ఏవేవో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
•ఇందిరమ్మ ఇళ్లు పేదవాళ్లలో అతిపేదవాళ్లకు ముందు మంజూరు చేస్తామన్నారు.
•లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయించి రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
జెడ్పిసమావేశం అనంతరం జిల్లా జడ్పిటిసి లను, ఎంపీపీ లను సన్మానించారు.
•జెడ్పిటిసి, ఎంపీపీ సభ్యులకు మరిన్ని అవకాశల కోసం ప్రజా క్షేత్రంలో ఇంకా కష్టపడి పని చేయాలి అని అన్నారు.ఉమ్మడి నల్గొండ జిల్లా లో జెడ్పి చైర్మన్ గా చేసి మళ్ళీ రాజకీయ క్షేత్రం లో మళ్ళీ గెలిచిన ఏకైక వ్యక్తి ని నేనే అని అన్నారు. ఇది కేవలం దేవరకొండ ప్రజలతో మమేకమై, వారితో కలిసి ప్రజాక్షేత్రం లో వారి కోసం కష్టపడి పని చేయడం వల్లనే దేవరకొండ ప్రజలు చరిత్ర ను తిరగారాశారు అని అన్నారు ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా జెడ్ పి టి సి లు, ఎంపీపీ లు ,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.