Homeసినిమాఆ సినిమాలో ఒక్క డైలాగ్​ కూడా ఉండదట..!

ఆ సినిమాలో ఒక్క డైలాగ్​ కూడా ఉండదట..!

ఇండియన్ సినిమాలో ఉన్న అతి తక్కువ వెర్సటైల్ హీరోస్​లో కోలీవుడ్ స్టార్ నటుడు చియాన్ విక్రమ్ ఒకరు. అపరిచితుడు తర్వాత విక్రమ్​కు ఆ స్థాయిలో సినిమా పడలేదు. వరుస ఫ్లాప్​లు వెంటాడుతున్నా ఆయన కొత్తదనాన్ని విడిచిపెట్టడం లేదు. ప్రయోగాత్మక సినిమాలను చేస్తూనే ఉన్నారు. అయితే, పొన్నియన్ సెల్వన్1, 2 బ్లాక్ బస్టర్ అయినప్పటికీ అది మల్టీస్టారర్​ కావడంతో విక్రమ్​కు సోలో క్రెడిట్ దక్కలేదు. కాకపోతే ఆ సినిమాలో ఆయన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. తాజాగా విక్రమ్​ నటించిన ‘తంగలాన్’మూవీ రిలీజ్​కు రెడీగా ఉంది. ఈ సినిమా టీజర్​ను బుధవారం మేకర్స్​ రిలీజ్ చేయగా.. అందరినీ ఆకట్టుకుంటున్నది. చాలారోజుల తర్వాత విక్రమ్ మరో పొటెన్షియల్ సబ్జెక్ట్ ఉన్న మూవీ చేస్తున్నట్లు టీజర్ చూస్తే తెలిసిపోతున్నది. అయితే, ఈ మూవీకి సంబంధించి విక్రమ్ కొన్ని ఇంట్రెస్టింగ్​ విషయాలు చెప్పగా.. ప్రస్తుతం అవి వైరల్​గా మారాయి. తనకు ఒక శివ పుత్రుడు, అపరిచితుడు, ఐ సినిమాల తరహాలో తంగలాన్​ కూడా డిఫరెంట్ మూవీ అని విక్రమ్ తెలిపాడు. ఇలాంటి ఒక సినిమా ఎప్పుడూ చేయలేదని.. శివ పుత్రుడు తరహాలో తంగలాన్​లోనూ తనకు ఒక్క డైలాగ్​ కూడా ఉండదని ఆ సినిమాపై ఓ క్లారిటీ ఇచ్చాడు విక్రమ్.

Recent

- Advertisment -spot_img