ఏపీలోని అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లిలో పదేళ్లలోపు వయసున్న ఇద్దరు కూతుళ్లను కన్నతండ్రే అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. సీఐ రమేశ్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. బోయకొండ (28) కొంతకాలం నుంచి 9, 7 ఏళ్ల వయసున్న కూతుళ్లపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడని అతడి భార్య ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కూతుళ్లపై తండ్రి అఘాయిత్యానికి పాల్పడినది వాస్తవమని తేలడంతో అతడిపై పోక్సో కేసు నమోదు చేసి సోమవారం అరెస్టు చేశారు.