ఓ రైతు మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు ఒక జర్నలిస్టు పై కేసు పెట్టడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుబట్టారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఈ వీడియోలో అసలు తప్పు ఏమిటి? దీనికే జర్నలిస్టు గౌతం గౌడ్ పై కేసు పెట్టారా? నేను ఈ రైతు మల్లయ్యను ఆయన స్వగ్రామంలో సందర్శించి, ఆయన పరిస్థితి గురించి ఆరా తీశాను. ఇప్పుడు నాపైన కూడా కేసు పెడతారా?’ అంటూ ఆ వీడియోను షేర్ చేశారు.