తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానన్నారు. సినీ ప్రముఖులతో భేటీలో ఆయన ఈ మేరకు వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధిలో సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతతో ఉండాలని సూచించారు. హీరోలు, హీరోయిన్లు ఆలయ పర్యాటకం, ఎకోటూరిజాన్ని ప్రచారం చేయాలని తెలిపారు.