Homeహైదరాబాద్latest Newsఏపీ కేబినెట్‌లో 24 మంత్రులు వీరే.. ఇందులో 17 మంది కొత్తవారే..!

ఏపీ కేబినెట్‌లో 24 మంత్రులు వీరే.. ఇందులో 17 మంది కొత్తవారే..!

ఏపీ ముఖ్యమంత్రిగా నేడు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు నేతృత్వంలో ఏపీ కేబినెట్ కొలువుదీరనుంది. ఆయనతో పాటు 24 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్న వారి జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక విడుదల చేశారు. మొత్తం 24 మందికి ఈ జాబితాలో చోటు దక్కగా.. జనసేన నుంచి ముగ్గురికి, బీజేపీ నుంచి ఒకరికి మంత్రి పదవి లభించింది. ఇదిలా ఉండగా.. కేబినెట్‌లో 17 మంది కొత్తవారే ఉండడం గమనార్హం.

ఏపీ కేబినెట్‌లో 24 మంత్రులు వీరే:

  1. కొణిదెల పవన్ కల్యాణ్
  2. నారా లోకేశ్
  3. కింజరాపు అచ్చెన్నాయుడు
  4. కొల్లు రవీంద్ర
  5. నాదెండ్ల మనోహర్
  6. పొంగూరు నారాయణ
  7. అనిత వంగలపూడి
  8. సత్యకుమార్ యాదవ్
  9. నిమ్మల రామానాయుడు
  10. ఎన్ఎండీ ఫరూక్
  11. ఆనం రామనారాయణ రెడ్డి
  12. పయ్యావుల కేశవ్
  13. అనగాని సత్యప్రసాద్
  14. కొలుసు పార్థసారథి
  15. డోలా బాల వీరాంజనేయస్వామి
  16. గొట్టిపాటి రవికుమార్
  17. కందుల దుర్గేష్
  18. గుమ్మడి సంధ్యారాణి
  19. బీసీ జనార్దనరెడ్డి
  20. టి. జి. భరత్
  21. ఎస్. సవిత
  22. వాసంశెట్టి సుభాష్
  23. కొండపల్లి శ్రీనివాస్
  24. మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి

Recent

- Advertisment -spot_img