Most Dot Balls Bowled in IPL History: ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసింది.. ఇప్పుడు ఐపీఎల్ సంబరాలు ప్రారంభం కానున్నాయి. మే 22న డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది..టీ20 క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ సులభంగా పరుగులు సాధించగలరు కాబట్టి వారికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. కాబట్టి బౌలర్లు పరుగుల ప్రవాహాన్ని ఆపడానికి వారి బౌలింగ్‌లో వ్యూహాత్మక మార్పులు చేసుకోవాలి. అందుకే టీ20ల్లో డాట్ బాల్స్ చాలా గొప్పవి. డాట్ బాల్ వేయడం అంటే ఆటలో సగం గెలిచినట్లే. అయితే ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలో డాట్ బాల్స్ వేసిన టాప్ 10 బౌలర్లను చూద్దాం.
ఐపీఎల్ లో అత్యధిక డాట్ బాల్స్(Most Dot Balls Bowled in IPL History) వేసిన ఆటగాళ్ల జాబితా:
- భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ లో 1,729 డాట్ బాల్స్ వేసి టాప్ లో ఉన్నాడు
- సునీల్ నరైన్ ఐపీఎల్ లో 1,631 డాట్ బాల్స్ తో రెండో స్థానంలో ఉన్నాడు.
- రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ లో 1,606 డాట్ బాల్స్ వేసి ఆ తర్వాతి స్థానంలో ఉన్నాడు.
- పియూష్ చావ్లా ఐపీఎల్ లో 1,358 డాట్ బాల్స్ తో నాల్గో స్థానంలో ఉన్నాడు.
- హర్భజన్ సింగ్ ఐపీఎల్ లో 1,312 డాట్స్ వేసి తో ఐదవ స్థానంలో ఉన్నాడు.