Most Dot Balls Bowled in IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్‌లో బీసీసీఐ, టాటా గ్రూప్ ప్రతి డాట్ బాల్‌కు 18 మొక్కలు నాటుతామని ప్రకటించిన సంగతి తెలిసందే. క్రమంలో ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల్లో ఎక్కువ డాట్ బాల్స్ వేసి అత్యధిక మొక్కలు నాటించిన బౌలర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ 78 డాట్ బాల్స్‌తో మొదటి స్థానంలో ఉన్నాడు. ఖలీల్ 78 × 18 = 1,404 మొక్కలు నాటడానికి దోహదపడ్డాడని చెప్పొచ్చు. ఆ తర్వాత మహ్మద్ సిరాజ్ 73 డాట్ బాల్స్‌తో (73 × 18 = 1,314 మొక్కలు) రెండో స్థానంలో, వరుణ్ చక్రవర్తి 70 డాట్ బాల్స్‌తో (70 × 18 = 1,260 మొక్కలు) మూడో స్థానంలో ఉన్నారు. అలాగే ప్రసిద్ధ్ కృష్ణ (GT) – 65, హర్షిత్ రాణా (KKR) – 64, జోష్ హేజిల్‌వుడ్ (RCB) 62 తర్వాత స్థానాల్లో ఉన్నారు.