Homeహైదరాబాద్latest Newsఅత్యధిక పారితోషికం తీసుకునే ఐదుగురు హీరోయిన్స్ వీరే.. ఒక మూవీకి ఎంత తీసుకుంటారో తెలుసా?

అత్యధిక పారితోషికం తీసుకునే ఐదుగురు హీరోయిన్స్ వీరే.. ఒక మూవీకి ఎంత తీసుకుంటారో తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. వారిలో స్టార్ హీరోయిన్స్ గా నయనతార, సమంత, రష్మిక మందన… ఇలా జాబితా కొనసాగుతుంది. వారిలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఐదుగురు హీరోయిన్స్ ఎవరో తెలుసుకుందాం…

-తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటి నయనతార. లేడీ సూపర్‌స్టార్‌గా పేరుగాంచిన ఈ నటి ఒక్కో సినిమాకు 13 కోట్ల నుంచి 15 కోట్ల వరకు తీసుకుంటుంది. మలయాళంలో కెరీర్ ప్రారంభించిన ఈ తార తమిళం, తెలుగులో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది.

-స్టార్ హీరో లేకపోయినా సినిమాలు సక్సెస్ అవుతాయని చూపించిన నటి అనుష్క శెట్టి. అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా అనుష్క రెండో స్థానంలో నిలిచింది. అనుష్క 4 కోట్ల నుంచి 7 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది.అనుష్క ఎన్నో పవర్ ఫుల్ క్యారెక్టర్స్ తో అభిమానుల మనసు దోచుకుంది.

-పూజా హెగ్డే ఒక్కో సినిమాకు ఐదు కోట్లు పారితోషికం తీసుకుంటుంది.ప్రస్తుతం ఆమె సౌత్ ఇండియా మరియు బాలీవుడ్‌లో బిజీ స్టార్. ఈ నటి చివరిగా రాధే శ్యామ్ చిత్రంలో ప్రభాస్ సరసన నటించింది. విజయ్ చివరి చిత్రం దళపతి 69లో పూజా హీరోయిన్ గా నటిస్తుంది.

-రెండు దశాబ్దాలకు పైగా సౌత్ ఇండియన్ సినిమాలో ఓ వెలుగు వెలిగిన స్టార్ బ్యూటీ త్రిష కృష్ణ. తమిళం, తెలుగు భాషల్లో బాగా పాపులర్ అయిన త్రిష ఒక సినిమాకు నాలుగు నుంచి ఆరు కోట్ల వరకు తీసుకుంటుంది.

-నేషనల్ క్రష్ రష్మిక మందన ఐదో స్థానంలో ఉంది. ఆమె రెమ్యూనరేషన్‌గా 3 కోట్ల నుంచి 4 కోట్ల వరకు తీసుకుంటుంది. అల్లు అర్జున్ నటించిన పుష్పతో రష్మిక బాలీవుడ్‌లో దృష్టిని ఆకర్షించింది.

Recent

- Advertisment -spot_img