Homeహైదరాబాద్latest Newsఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సీఎం చంద్రబాబు చేసిన ఐదు సంతకాలు ఇవే..!

ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సీఎం చంద్రబాబు చేసిన ఐదు సంతకాలు ఇవే..!

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చంద్రబాబు చకచకా పనులు చక్కదిద్దుతూ ప్రతి ఒక్కరి నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంటున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే చెప్పిన మాట ప్రకారం ఐదు సంతకాలు చేశారు. అవి ఏంటంటే..

  1. నిరుద్యోగుల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తూ MEGA DSC మీద మొదటి సంతకం చేసి జాబు రావాలంటే బాబు రావాలి అనే నినాదాన్ని నిజం చేశారు.
  2. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పై చేసి మీ భూమి మీ సొంతం అని భూ హక్కుదారుల లో ధైర్యాన్ని నింపారు.
  3. అవ్వ తాతల కి ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ 4000 రూపాయలు చేస్తూ 3వ సంతకం చేసి ఇంటికి పెద్ద కొడుకులా అవ్వ తాతలకు అండగా నిలిచాడు.
  4. ఎంతోమంది నిరుపేదల ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్ పునరుద్ధరణ చేస్తూ నాల్గవ సంతకం పెట్టి పేద ప్రజల మన్ననలు అందుకున్నారు.
  5. స్కిల్ సెన్సెస్( విద్యార్థుల నైపుణ్యము) విద్యార్థులను వారి నైపుణ్యాలను పెంచే విధంగా చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తూ ఐదవ సంతకం చేశారు.

మొదటి రోజే ఇచ్చిన మాట ప్రకారం ఐదు హామీలను నెరవేరుస్తున్న సీఎం చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు.

Recent

- Advertisment -spot_img