2024 సంవత్సరంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తెలంగాణ నేపధ్యంలో చాలా సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన “టిల్లు స్క్వెర్” 100కోట్ల క్లబ్‌లో బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. “రజాకార్” మొదటి షో నుండే మంచి టాక్ తో మంచి కలెక్షన్లు రాబట్టుకుంది. తెలంగాణ పెళ్లి నేపధ్యంలో వచ్చిన “లగ్గం” థియేటర్లల్లో డీసెంట్ హిట్టుగా నిలిచింది. “పొట్టేలు” పర్వాలేదు అనిపించింది. “సర్కారు నౌకరి” OTT ప్రేక్షకుల మన్ననలు పొందింది.