Homeహైదరాబాద్latest Newsఈ సంవత్సరంలో టాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త భామలు.. వీరే..!

ఈ సంవత్సరంలో టాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త భామలు.. వీరే..!

ఇతర భాషల హీరోయిన్లు టాలీవుడ్‌లోకి రావడం సర్వసాధారణం. అయితే ఈ 2024 సంవత్సరంలో బాలీవుడ్‌తో పాటు, తమిళ, మలయాళ భాషల నుండి చాలా మంది హీరోయిన్లు తెలుగు సినీ పరిశ్రమలోకి పరిచయమ్యారు. వారిలో కొంతమంది భారీ విజయాలు అందుకుంటే.. మరికొందరు మాత్రం మొదటి సినిమాతోనే డిజాస్టర్లు అందుకున్నారు.

  1. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా ‘కల్కి 2898 AD’. ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె టాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా విడుదలై ఏకంగా 1,200 కోట్ల వసూళ్లు రాబట్టింది.
  2. స్టార్ హెరో ఎన్టీఆర్ నటించిన సినిమా ‘దేవర’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ వసూళ్లు చేసింది. ఈ సినిమాతో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్‏ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. జాన్వీ నటించిన మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
  3. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన సినిమా ‘మిస్టర్ బచ్చన్’. ఈ సినిమాతో భాగ్య శ్రీ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది. విడుదలకు ముందే ఈ భామ పేరు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. అయితే సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
    4.యంగ్ హీరో నిఖిల్ నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే సినిమాతో టాలీవుడ్‏లోకి కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ ఆడుగుపెట్టింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
  4. నయన్ సారిక ఈ సంవత్సరం రెండు విజయాలు అందుకుంది. ‘ఆయ్’, ‘కా’ సినిమాలతో ఆమెకు హిట్లు వచ్చాయి. అంతకు ముందు ఆనంద్ దేవరకొండ నటించిన ‘గమ్ గమ్ గణేశ’ సినిమాలో నటించింది.
  5. వరుణ్ తేజ హీరోగా నటించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాతో తెలుగు తెరకు మానుషి చిల్లర్ పరిచయమైంది. అయితే ఈ సినిమా పెద్దగా హిట్ కాలేదు. దాంతో ఈ భామకి అవకాశాలు లేవు.

Recent

- Advertisment -spot_img