వేసవిలో డీహైడ్రేషన్ అనేది ఒక సాధారణ సమస్య. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ వేసవిలో డీహైడ్రేషన్ కు గురవుతారు. అయితే, దీనిని నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. రోజుకు 3 లేదా 4 లీటర్ల నీరు ఖచ్చితంగా తాగాలి. చాలా చల్లగా ఉండే నీరు తాగవద్దు. అలాగే, ఎక్కువగా ఏసీ వాడవద్దు. కాఫీ, టీ మరియు కారంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.