నందమూరి బాలకృష్ణ సినీనటుడిగా పరిచయం అయ్యి 50 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఆయనను ఘనంగా సత్కరించింది. సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ మొత్తం తరలివచ్చింది. అయితే ఇంతటి ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు నందమూరి కుటుంబం నుంచి ఇద్దరు మిస్ అయ్యారు . వారే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. వీరు ఎందుకు రాలేదంటూ టాలీవుడ్ వర్గాల్లో పెద్ద డిస్కషన్ నడుస్తోంది. ఎన్టీఆర్ – బాలయ్య మధ్య సంబంధాలు దెబ్బతినడానికి చాలా కారణాలు ఉన్నాయని అంటూ ఉంటారు. అల్లుడు నారా లోకేష్ కోసం జూనియర్‌ను బాలకృష్ణ దూరం పెడుతున్నారని రాజకీయ వర్గాల టాక్. తన మేనత్త నారా భువనేశ్వరిని ఏపీ అసెంబ్లీలో వైసీపీ నేతలు అవమానిస్తే , ఎన్టీఆర్ సరిగా స్పందించకపోవడం బాలయ్యకు ఆగ్రహం తెప్పించదని కూడా చెబుతుంటారు. టీడీపీకి చావోరేవో వంటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జూనియర్ కనీసం మాట మాత్రంగానైనా సపోర్ట్ చేయకపోవడం కూడా తెలుగుదేశం వర్గాలను , బాలయ్యను బాగా డిజప్పాయింట్ చేసిందట.