ఒకప్పుడు కనీసం 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా గుండె సంబంధిత ఇబ్బందులు కనిపించేవి. కానీ ప్రస్తుతం కాలం మారింది. మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, శారీరకశ్రమ పూర్తిగా తగ్గిపోవడం, కారణం ఏదైనా.. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. గుండె పోటు వచ్చే ముందు కనిపించే లక్షణాల్లో శరీరంలో వాపు ఒకటి. ముఖ్యంగా చీలమండలు వంటి శరీరంలోని కొన్ని భాగాలలో వాపు మొదలవుతుంది. ఇది కాలక్రమేణా పెరిగుతూ ఉంటుంది. తక్కువ పనికే ఎక్కువ అలసటగా అనిపిస్తున్నా అది కూడా పనితీరులో వచ్చిన మార్పు లక్షణంగా భావించాలి. వెంటనే సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.