Homeహైదరాబాద్latest Newsభార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త చేయాల్సిన పనులు ఇవే : Health News

భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త చేయాల్సిన పనులు ఇవే : Health News

గర్భిణీ స్త్రీలు ప్రసవం అయ్యే వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు భర్త కూడా ఎంతో సహకరించాలి. లేకపోతే ఇబ్బందులు రావడమే రాకుండా ఇద్దరి మధ్య విబేధాలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గర్భిణీ స్త్రీ ఏమి తింటుంది..? ఆమె వాతావరణంలో ఎలా జీవిస్తుంది..? ఆమెకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయా..? ఇవన్నీ కూడా ఆమె కడుపులో పెరుగుతున్న శిశువుపై ప్రభావం చూపుతాయి. కొంతమంది పిల్లలు చాలా ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉంటారు. మరికొంత మంది పిల్లలు చిరాకుగా, కోపంగా ఉండటానికి ఇదే కారణం అంటున్నారు నిపుణులు. సహజంగానే ప్రతి తల్లిదండ్రులు మన బిడ్డ ఉల్లాసంగా, ఉల్లాసంగా ఉండాలని కోరుకుంటారు. అందువల్ల మీరు గర్భధారణ సమయంలో మీ భార్య పట్ల అదనపు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. దీని ద్వారా ఆమె ఒత్తిడి నుంచి విముక్తి పొందుతారు. భార్య గర్భవతి అయినప్పటి నుంచి భర్త కేరింగ్‌ అనేది ఎంతో ముఖ్యం. ఎంత కేరింగ్‌ తీసుకుంటే మీపై అంత ప్రేమ పెరుగుతుంది. లేకపోతే ఇద్దరి మధ్య ప్రేమ తగ్గి ఆమె ప్రసవంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందంటున్నారు. సంతానం కావాలనుకునే దంపతులకు గర్భం దాల్చిన వార్త ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తుంది. కొన్ని వారాలు ఈ ఆనందాన్ని అవదులు ఉండవు. అయితే వైద్యురాలు ఆమెకు ఎలాంటి సలహాలు ఇచ్చింది..? మందులు ఎప్పుడు వేసుకోవాలి..? ఎన్ని వారాల తర్వాత చెక్‌ చేసుకోవాలి.. డైట్ ఎలా తీసుకోవాలి.. తదితర విషయాలన్ని డైరీలో నోట్‌ చేసుకోవడం మంచిది. ఇలా డైరీని మైంటైన్ చేయడం ద్వారా.. భార్య ఆరోగ్యం విషయంలో భర్త తన తదుపరి చేయాల్సిన పనిని గుర్తుంచుకునే వీలుంటుంది. డెలివరీ తర్వాత మహిళలు తరచుగా ప్రసవానంతర డిప్రెషన్‌కు గురవుతారు. ఈ సమయంలో ఆమెకు మానసిక, భావోద్వేగ మద్దతు చాలా అవసరం. అన్ని వేళల నీకు తోడున్నానని, ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని చెప్పండి. ఇలా కొన్ని కొన్ని విషయాలు భార్యతో చెప్పడం వల్ల వారు మానసికంగా ప్రశాంతంగా ఉండడమే కాకుండా పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా పుడతారని నిపుణులు చెబుతున్నారు.

Recent

- Advertisment -spot_img