ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. అయితే చరిత్రలో గెలవలేకపోయిన రెండు స్థానాల్లో ఈ సారీ గెలవలేకపోయింది. పులివెందులలో 1978 నుంచి వైఎస్ కుటుంబం గెలుస్తూ వస్తోంది. అక్కడ ప్రస్తుతం వైఎస్ జగన్ గెలిచారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో వైసీపీ అభ్యర్థి చంద్రశేఖర్ గెలిచారు. ఇది 1972లో నియోజకవర్గంగా రద్దయి 2009లో ఉనికిలోకి వచ్చింది.