తాజాగా ఒక పెళ్లి వేడుకలో జరిగిన సంఘటన వైరల్ గా మారింది. ఇందులో ఒక వధువు ప్రవర్తించిన తీరును నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. పెళ్లి వేడుకలో కొత్త జంటకు చాలా మంది ఎవరికి తోచిన విధంగా గిఫ్ట్ లు, డబ్బులను చేతిలో ఇస్తున్నారు ఇదే క్రమంలో.. ఒక వ్యక్తి చేతిలో కొత్త జంటకు సపరేట్ గా డబ్బులు ఇచ్చాడు. అప్పుడు వధువు..తన డబ్బులను మాత్రం, పక్కన పెట్టుకుంది. అంతటితో ఆగకుండా వరుడి చేతిలో డబ్బులను కూడా మెల్లగా తీసుకుంది. వరుడు పరధ్యానంలో ఉన్నట్టు నటించాడో లేదా నా భార్యే కదా..ఎవరి దగ్గర ఉంటే ఏమవుతుంది అనుకున్నాడో కానీ.. ఏవిధంగా కూడా రెస్పాండ్ కాలేదు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.