చల్లటి వాతావరణం డయాబెటిస్ రోగులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. 50 ఏళ్లు దాటిన షుగర్ పేషెంట్లలో జలుబు, దగ్గు, జ్వరం, వివిధ ఇన్ఫెక్షన్లు వంటివి వచ్చే అవకాశం మిగతా వారికంటే ఎక్కువగా ఉంటుంది. పైగా త్వరగా తగ్గవు. అందుకోసం వెచ్చటి దుస్తులు, చెవులను కవర్ చేసేలా ఉన్ని క్యాపులు, మఫ్లర్లు వంటివి ధరించడం చేయాలి. మందులు క్రమం తప్పకుండా వాడాలి. వ్యాయామాలు మాత్రం ఆపకూడదు. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరిగి, షుగర్ అదుపులో ఉంటుంది.