జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టడంలో పసుపు కీలక పాత్ర పోషిస్తుందని తాజా పరిశోధనల్లో తేలింది. పసుపులోని కర్‌క్యుమిన్ అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది. కడుపులో ఆమ్లం తగ్గటానికి వాడే ఒమిప్రజోల్ మందుతో సమానంగా పసుపు పనిచేస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది. అంతేకాక, శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. కడుపు నొప్పి, ఉబ్బరం, గ్యాస్, అతిసారం, మలబద్ధకం వంటి సమస్యలకు పసుపు చెక్ పెడుతుంది.