అనుభవం అయితే కానీ తత్వం బోధపడదని పెద్దలు అంటారు. వైసీపీలో ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఉంది అని అంటున్నారు. అయితే ఎన్నికలకు ముందు జగన్ దాదాపు 80 నియోజకవర్గాల్లో కొత్తవారిని బరిలోకి దింపారు. ఎన్నికల ముందు జగన్ చేసిన ఈ మార్పులు బెడిసికొట్టాయి. అయితే వైసీపీ అధినాయకత్వం ఇప్పుడు మనసు మార్చుకుంది. పాత వారిని వారి సొంత నియోజకవర్గాలకు పంపిస్తోంది.