Homeహైదరాబాద్latest Newsకాంగ్రెస్ ప్రభుత్వం ఏం పీకిందని విజయోత్సవాలు చేస్తున్నారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పీకిందని విజయోత్సవాలు చేస్తున్నారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

వరంగల్ జిల్లాలో పర్యటించేందుకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. వరంగల్‌లో బైక్ ర్యాలీ చేస్తూ కేటీఆర్ కు అడుగడుగునా పలికిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నేతన్నలకు, పద్మశాలి సోదరులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు అని అన్నారు. సిరిసిల్లలో నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. నిన్న చేనేత పనులు చేసుకునే భార్య, భర్త అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు అని తెలిపారు.నిన్న మహారాష్ట్రలో రూ. 500 బోనస్ ఇస్తున్న అని రేవంత్ రెడ్డి దగుల్బాజీ మాటలు మాట్లాడుతున్నాడు..రూ.500 బోనస్ ఒక్కరికి ఇచ్చినట్టు చూపిస్తే మేము అందరం రాజీనామా చేస్తాము అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ పేరుతో బలహీన వర్గాలను వెన్నుపోటు పొడిచింది. బీసీ సబ్ ప్లాన్, 42% రిజర్వేషన్లు, లక్ష కోట్లు అని మోసం చేశారు.. బీసీలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నేరవేర్చలేదు అని నిలదీశారు. కాంగ్రెస్ వాళ్లని వదిలిపెట్టం… పొంగులేటికి బాంబులు శాఖ మంత్రి పదవి ఇవ్వాలి.. ఏమైనా అంటే బాంబులు అని అంటున్నాడు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పీకిందని విజయోత్సవాలు చేస్తున్నారు అని కేటీఆర్ మండిపడ్డారు.

Recent

- Advertisment -spot_img