Homeహైదరాబాద్latest Newsస్వార్థం కోసమే పార్టీ మారుతున్నారు

స్వార్థం కోసమే పార్టీ మారుతున్నారు

  • మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
  • ఎంపీగా గెలిపిస్తే ప్రజాగొంతుకనవుతా..
  • జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్

ఇదేనిజం, నారాయణఖేడ్ : స్వార్థ పూరిత నాయకులే బీఆర్ఎస్‌ను విడిచి వెళ్తున్నారని అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు మాత్రం పార్టీలోనే ఉన్నారన్నారు. శనివారం నారాయణఖేడ్‌లో జరిగిన నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యతిథిగా పాల్గొని మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తుందన్నారు. ఇక బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని కేంద్ర ప్రభుత్వం కేసులు పెట్టి జైళ్లకు పంపుతుందని ఆయన ఆరోపించారు. జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్ మాట్లాడుతూ ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్‌లో ప్రజల గొంతుకనవుతానని చెప్పారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న సమస్యలు తనకు తెలుసన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే తీరుస్తానని హామీనిచ్చారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటానన్నారు.

Recent

- Advertisment -spot_img