తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ అల్లుళ్ల కోసం, వాళ్ళ బంధువుల కోసం ఈ ఫార్మా సిటీ పేరుతోని పేదోళ్ల భూములు గుంజుకునే ఘోరమైన ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు. పట్నం నరేందర్ రెడ్డి చెప్పకపోయినా ఆయన చెప్పినట్టుగా ఖాళీ పేపర్ మీద ఆయన సంతకం తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కేటీఆర్ పేరు మిగతావాళ్ళ పేర్లు పెట్టారు అని ఆరోపించారు. ఎలా అయినా సరే రైతుల దగ్గర నుండి భూములు గుంజుకొని తన అల్లుడికి కట్టబెట్టాలను ప్లాన్ తోనే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ప్రవీణ్ కుమార్ అన్నారు.