కడప కార్పొరేషన్ హైస్కూల్‌లో జరిగిన పేరెంట్స్ సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. హీరోలను సినిమాల్లోని నటీనటుల్లో కాకుండా మీ గురువుల్లో చూడాలి అని తెలిపారు. సినిమా డైలాగులు చెబితే.. సినీ హీరోలు నడిస్తే వెనక రీరికార్డింగులు వస్తాయి. కార్గిల్ లో చనిపోయిన వారికి, ఉపాధ్యాయులకు రీరికార్డింగులు ఉండవు. కానీ వారే నిజమైన హీరోలు అని పవన్ కళ్యాణ్ అన్నారు.