బీజేపీ పార్టీ నేతలకు బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కలిసికట్టుగానే పని చేస్తున్నారు మీ కమలంనేతలు.. కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసిపోయి మరీ మీరంతా పని చేస్తున్నారు అని కేటీఆర్ కామెంట్స్ చేసారు. చోటేభాయ్ కు వ్యూహకర్తగా.. కాంగ్రెస్ కట్టర్ కార్యకర్తలుగా.. విశ్రమించకుండా పని చేస్తున్నారు అని కేటీఆర్ ఆరోపించారు. చీకటి రాజకీయ ప్రయోజనాల కోసం.. ‘చేతి’ కలుపుతూ చోటే భాయ్ కోసం కలిసి పని చేస్తున్నారు అని కేటీఆర్ వారిపై మండిపడ్డరు. ఎన్ని అరాచకాలు జరిగినా ఒక్కరూ నోరుమెదపరు ఎందుకు అని కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి మీద ఈగ వాలకుండా కాపాడుకుంటారు అని కేటీఆర్ ఆరోపించారు. హైడ్రా మంచిదంటారు, మూసి కావాలంటారు, ఏమన్నా అంటే నిద్ర నటిస్తారు అని అన్నారు. పిల్లలు చనిపోయినా, రైతు గుండె పగిలినా, గిరిజనులను చెరపట్టినా, చప్పట్లు కొడతారు అని… తెలంగాణలో వారి చేతిలోనే కమలం ఉందని.. జాగ్రత్తగా జర భద్రంగా ఉండాలి అంటూ కేటీఆర్ అన్నారు.