మేడిపల్లి, ఇదేనిజం: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కో- ఆప్షన్ మెంబర్ గా ఎన్నికైన ఆళ్ల ప్రభాకర్,96 సార్లు వరుసగా రక్తదానం చేసిన మన కార్పొరేషన్ వాసి, జర్నలిస్టు మరాటి మల్లేష్ లను బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనిల సంక్షేమ సంఘాల సమాఖ్య (ఫెడరేషన్) అధ్వర్యంలో ఇవాళ ఘనంగా శాలువాలతో సత్కరించడం జరిగింది. ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్పొరేషన్ లో ప్రజల పక్షాన నిలబడి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఆంజిల్ ప్రభాకర్ కు సూచించారు. అదే విధంగా జర్నలిస్టు మరాఠీ మల్లేష్ వరుసగా 96 సార్లు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. రక్తదానం చేసి ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టే మంచి మనసు ఉండడం ఎంతో అభినందనీయమని కొనియాడారు, ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ అధ్యక్షులు కలుకూరి రాములు, చీఫ్ అడ్వైజర్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ చెంచల నర్సింగ్ రావు, కోశాదికారి జి.చంద్రశేఖర్, యూత్ వింగ్ అధ్యక్షుడు రాపోలు వెంకటేశ్వర రావు సభ్యులు ఎల్.రాజిరెడ్డి, ప్రభాకర్,తదితరులు పాల్గొన్నారు.
ఆళ్ల ప్రభాకర్, మరాటి మల్లేష్ లకు ఫెడరేషన్ ఘన సన్మానం…..
RELATED ARTICLES