నోరా ఫతేహి.. ప్రభాస్ బాహుబలి సినిమాలో మనోహరి అనే పాటతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ పాటలో తన అందచందాలతో అందరిని తన వశం చేసుకుంది. ఈ నటి డ్యాన్సర్ మాత్రమే కాదండోయ్ మోడలింగ్, సింగర్ కూడా. అయితే తాజాగా ఈ నటికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
తాజాగా ఈ బ్యూటీ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె తన ప్రైవేట్ పార్ట్స్ పై ఫోటో గ్రాఫర్స్ జూమ్ చేయడం గురించి ఓపెన్‌గా చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ..వారు ఇంతకు ముందెన్నడూ ఇలాంటి అందాలను చూడలేదని నేను అనుకుంటాను. ఇది నాకు మాత్రమే కాదు, ఇతర మహిళా హీరోయిన్స్ కూడా ఇలానే చేస్తున్నారంటూ కామెంట్స్ చేసింది. అలాగే తన బాడీ గురించి, తన అంద, చందాలను చేసినప్పుడు తనకు ఎంతో గర్వంగా ఉంటుందని చెప్పుకొచ్చింది.

