Homeతెలంగాణనాలుగు నెలలుగా వారికి జీతాలు లేవు.. వారికి వెంటనే జీతాలు చెల్లించండి: హరీశ్‌రావు

నాలుగు నెలలుగా వారికి జీతాలు లేవు.. వారికి వెంటనే జీతాలు చెల్లించండి: హరీశ్‌రావు

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీమంత్రి హరీశ్‌రావు ట్విట్టర్(X) వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన 7వేల మంది నర్సింగ్ ఆఫీసర్ల రిక్రూట్‌మెంట్ ఘనతను కాంగ్రెస్ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంది. అయితే వారికి 4 నెలలుగా జీతాలు చెల్లించడం లేదన్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా అట్టహాసంగా నియామక పత్రాలు అందించి గాలికి వదిలేసిందని విమర్శించారు. వారి జీతభత్యాల గురించి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్న నాలుగు నెలల జీతాలను వెంటనే చెల్లించాలని బీఆర్‌ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నట్లు హరీశ్‌రావు తెలిపారు.

Recent

- Advertisment -spot_img